అక్షయ్ కుమార్ ఇష్టమైన ప్లాట్ ను పైలెట్ కు అద్దెకు ఇచ్చారు!

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వ్యాపార రంగంలో కూడా తన ప్రత్యేకత చూపిస్తున్నారు. ఆయన తన ఇష్టమైన ఫ్లాట్‌ను పైలెట్ కు అద్దెకు ఇచ్చారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ కేవలం సినిమా రంగంలోనే కాదు, వ్యాపారంలో కూడా తన ప్రత్యేకత చూపిస్తున్నారు. ఆయన క్రమశిక్షణతో కూడిన జీవనశైలికి పేరు పొందారు. అక్షయ్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడంలో చాకచక్యంగా వ్యవహరిస్తారు. తాజాగా ఆయన ముంబైలోని అంధేరీ వెస్ట్ అనే ఖరీదైన ప్రాంతంలో ఉన్న తన విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చారు. ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్ అక్షయ్ కు ఎంతో ఇష్టం. ఈ ఫ్లాట్‌ను ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 పైలట్ కు అద్దెకు ఇవ్వడం విశేషం. ముంబై వంటి నగరంలో ప్రముఖుల ఇళ్లలో నివసించడం అంటే అది ఒక గౌరవంగా భావిస్తారు. ఇప్పుడు ఒక పైలట్ ఈ స్టార్ హీరో ఇంటిలో ఉంటున్నారు. దీనికి సంబంధించిన అద్దె ఒప్పందం, ఇతర పనులు పూర్తయ్యాయని సమాచారం.
Tags
Share this article!
0 people shared this