హీరోయిన్లకు పర్సనల్ బ్రాండింగ్ ఎలా కవచంగా మారింది

హీరోయిన్లకు పర్సనల్ బ్రాండింగ్ ఇప్పుడు ఎంతో ముఖ్యమైంది. ఒకప్పటి కంటే ఇప్పుడు హీరోయిన్ల భవిష్యత్తు సోషల్ మీడియా ఫాలోయింగ్ మీదే ఎక్కువ ఆధారపడుతోంది.
ఇప్పుడున్న ట్రెండ్‌లో హీరోయిన్లకు పర్సనల్ బ్రాండింగ్ చాలా ముఖ్యమైనది. ఒకప్పుడు హీరోయిన్ల భవిష్యత్తు ఆమె నటించిన సినిమాల విజయం లేదా పరాజయంపై ఆధారపడి ఉండేది. సినిమా హిట్టయితే అవకాశాలు ఎక్కువగా వచ్చేవి. ఫ్లాప్ అయితే కెరీర్ ప్రమాదంలో పడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు హీరోయిన్ల ఫాలోవర్ల సంఖ్య, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, ఫోటోషూట్లతో వచ్చే పాపులారిటీ చాలా ముఖ్యమైంది. సినిమా హిట్ లేదా ఫ్లాప్ అయినా, సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్న హీరోయిన్లను మేకర్స్ ముందుగా ఎంపిక చేస్తున్నారు. కారణం డిజిటల్ ప్రపంచంలో వీరి చేరిక చాలా త్వరగా జరుగుతుంది. ఒక హీరోయిన్ తన సోషల్ మీడియా లో సినిమా పోస్టర్ పెట్టినా, అది అందరికీ క్షణాల్లో చేరుతుంది. ఇది సినిమా ప్రచార ఖర్చులను తగ్గిస్తుంది. అందుకే ప్రస్తుతం క్రేజీ హీరోయిన్లకు అవకాశాలు తగ్గడం లేదు. అంతేకాదు, పర్సనల్ బ్రాండింగ్ కూడా హీరోయిన్లకు రక్షణ కవచంలా పని చేస్తోంది. సినిమా ఫెయిల్ అయినా కూడా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, కమర్షియల్ యాడ్స్ ద్వారా తమ క్రేజ్‌ను నిలిపి ఉంచుతున్నారు. ఇంతకీ నిర్మాతలు కూడా హీరోయిన్లను కేవలం నటిగా కాకుండా ఒక కమర్షియల్ బ్రాండ్ గా కూడా చూస్తున్నారు. సినిమా విజయం కంటే సోషల్ మీడియా క్రేజ్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ, ఈ ట్రెండ్ వల్ల ప్రతిభ ఉన్న కొత్త నటీమణులు వెనుకబడిపోతున్నారు. కేవలం సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా అవకాశాలు ఇస్తున్నారు. నటనకు స్క్రీన్ అప్పీల్ కి మాత్రమే ప్రాధాన్యత ఉండటం వల్ల గ్లామర్ తారలు ముందుకు వస్తున్నారు. సినిమా విజయం మరియు సోషల్ మీడియా క్రేజ్ మధ్య సమతుల్యత ఉండాలి. ఒకవేళ సోషల్ మీడియా పాపులారిటీతో కొంతకాలం నెట్టుకుంటారు, కానీ సుదీర్ఘ కాలం నిలబడాలంటే నటన చాలా అవసరం. సోషల్ మీడియా ఫాలోయింగ్ అనేది అదనపు అర్హత కావాలి. అప్పుడే ప్రతిభకు మరియు పాపులారిటీకి సమన్యాయం ఉంటుంది. ప్రేక్షకులు కూడా మంచి నటనను చూడగలుగుతారు.
Tags
Share this article!
0 people shared this