అల్లు అరవింద్ తిట్లకు బన్నీ వాస్ దూరంగా?

టాలీవుడ్‌లో బన్నీ వాస్ ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టాలీవుడ్‌లో నిర్మాత బన్నీ వాస్ ఇప్పుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలతో వార్తల్లో ఉన్నారు. ఇటీవల టాలెంటెడ్ హీరో అడివి శేష్ డెకాయిట్ మూవీ ఈవెంట్‌లో ఆయన చేసిన మాటలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బన్నీ వాస్ మాట్లాడుతూ, 'ఇటీవల ఎవరైనా పిలిచినా ఫంక్షన్లకు వెళ్లడం లేదు. అల్లు అరవింద్ గారు తిట్టిన తిట్లకు దూరంగా ఉంటున్నా. ఇకపై ఈవెంట్స్ కు రానని కూడా చెప్పేశా. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం నేను ఫంక్షన్ ఎప్పుడు అనడిగి వచ్చాను' అని చెప్పారు. తనకు సినిమా నచ్చిందని, అందుకే కొంతమేరకు అయినా సపోర్ట్ చేయాలని అనుకున్నానని చెప్పారు.
Tags
https://kiraaak.com/news/అల్లు-అరవింద్-తిట్లకు-బన్నీ-వాస్-దూరంగా-11-qnbq
Share this article!
0 people shared this